Bhashyam Praveen : మహార్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు – టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్

Bhashyam Praveen
Bhashyam Praveen : శనివారం పెదకూరపాడు నియోజకవర్గం లోని అచ్చంపేట ఆంజనేయస్వామి విగ్రహం నుంచి నిర్వహించిన మహార్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎన్డీయే కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్న ఒక వీడియోను కూడా ఆయన విడుదల చేశారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న అచంపేట, వేల్పూరు, క్రోసూరు, యర్రబాలెం, 88 తాళ్లూరు, గుడిపాడు, గరికపాడు, గాదెవారిపాలెం, వన్నాయపాలెం, చండ్రాజుపాలెం, చిట్యాల ఆర్ అండ్ ఆర్ సెంటర్, బెల్లంకొండ, నాగిరెడ్డిపాలెం మీదుగా బెల్లంకొండ గ్రామాల నాయకులకు, కార్యకర్తలకు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
అలాగే ఈ మహార్యాలీ విజయవంతం చేయడానికి కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 13వ తేదీ సోమవారం రోజున జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకుని తనను భారీ మెజార్టీతో గెలిపించాలని భాష్యం ప్రవీణ్ కోరారు.