Ratan Tata : “నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు”.. కన్నీళ్లు పెట్టిస్తున్న రతన్ టాటా చివరి పోస్ట్

Ratan Tata
రతన్ టాటా వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను వ్యాపారవేత్త అయినప్పటికీ. ఎన్ని విమర్శలు చేసినా.. ప్రజల కోసం వెనుకడుగు వేయడం లేదు. ప్రయోగాలు చేయడంలో రతన్ టాటా ఒకడుగు ముందున్నారు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ తాజాగా ఉండేవి. సామాన్యుడి ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రతి వస్తువును కార్పొరేట్ తరహాలో సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు టాటా కంపెనీల ద్వారా రతన్ టాటా విశేష కృషి చేశారు.
తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ అక్టోబర్ 7న రతన్ టాటా ట్వీట్ చేశారు. తన ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేయవద్దని సూచించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు. దురదృష్టవశాత్తు ఆయన పోస్ట్ చేసిన మూడు రోజులకే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన చివరి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ.. తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
