TG New Code : కొత్త కోడ్ తో ఆర్టీఏకు పైసలే పైసలు.. 0001 నంబర్ ఎంత పలికిందో తెలిస్తే షాకే!

TG New Code

TG New Code, RTA Office

TG New Code : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు తనదైన మార్పులను చేపడుతోంది. గత ప్రభుత్వం తాలుకు ఆనవాళ్లు కనపడకుండా చేస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్ శుభప్రదంగా ఉంటుందని తెలంగాణ అబ్రివేషన్ టీ‘ఎస్’ గా మార్చారు. దీన్నే వాహనాల నంబర్లకు, ఇతర వ్యవహారాల్లో వాడారు. కాంగ్రెస్ దీన్ని మార్చి ‘టీజీ’గా అధికారికంగా అమలు చేస్తోంది.

వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కొత్త టీజీ కోడ్ కాసులు కురిపిస్తోంది. కోడ్ ప్రారంభమైన తొలి రోజే గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో భారీగా ఆదాయం వచ్చింది. ఫీజు, ఫ్యాన్సీ నంబర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రూ.2.51 కోట్ల ఆదాయం రాగా, అందులో రూ.1.32 కోట్లు మూడు జిల్లాల నుంచే సమాకూరింది. అన్ని కార్యాలయాల్లో టీజీతో పాటు 0001 కొత్త సిరీస్ ప్రారంభం కావడంతో.. ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకోవడానికి వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. ఆన్ లైన్ లో పోటాపోటీగా బిడ్డింగ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో టీజీ 09 0001 నంబర్ ఏకంగా రూ.9,61,111 ధర పలికింది. రాజీవ్ కుమార్ ఆన్ లైన్ బిడ్డింగ్ లో ఈ ఫ్యాన్సీ నంబర్ ను దక్కించుకున్నారు. కాగా, 0009, 0999 నంబర్లను కూడా పోటీపడి మరి దక్కించుకున్నారు.

ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులకు మాత్రం పాత టీఎస్ కోడ్ తోనే రిజిస్ట్రేషన్లు చేశారు. మరో 15 రోజుల వరకు పాత స్లాట్లు నడువనున్నాయి. కొత్త వాహనాలు కొన్నవారికి మాత్రం టీజీ కోడ్ తో సిరీస్ కేటాయిస్తున్నారు. పాత విధానం ప్రకారమే నంబర్లకు నిర్ణీత ఫీజు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

TAGS