Telangana : తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించడం వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ బడులు పునః ప్రారంభమయ్యాయి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పేరుతో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అయితే, ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాల్లో ముందుమాట పేజీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉన్నాయి. ఈరోజు ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.