Army vehicle : ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు
army vehicle : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులు జరిపారు. ఈసారి ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. సోమవారం అఖ్నూర్ సెక్టార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని సమాచారం.
వారం రోజుల క్రితం సాధారణ ప్రజలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. గత గురువారం (అక్టోబరు 24) ఆర్మీ వాహనంపై దాడి చేశారు. ఉత్తర కాశ్మీర్ గుల్మార్గ్ లోని బోటాపతేర్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై దాడి చేయగా ఐదుగురు భారత జవాన్లు గాయపడ్డ విషయం తెలిసిందే.