JAISW News Telugu

T20 World Cup : టీ20 వరల్ట్ కప్ కు టెర్రరిస్టుల హెచ్చరికలు

T20 World Cup

T20 World Cup : జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ టీ 20 వరల్డ్ కప్ కు  సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది. టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో ఉగ్రదాడులు చేస్తామని పాకిస్థాన్ లోని టెర్రరిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఐసీసీ క్రికెట్ మండలి చెబుతోంది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, అమెరికా, ఐసీసీ పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టామని తెలిపాయి.

నార్త్ పాకిస్థాన్ ప్రాంతం నుంచి ఓ సందేశం వచ్చిందని రాబోయే టీ 20 వరల్డ్ కప్ లో ఉగ్రదాడులు చేస్తామని హెచ్చరికలు పంపారని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈవో జానీ గ్రేవ్స్ తెలిపారు. అయితే సెక్యూరిటీ పరంగా అత్యంత కఠినంగా వ్యవహరించనున్నామని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చే సిటీలు, పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భదత్ర ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడించారు.

ట్రినిడాడ్ అండ్ టిబాగో ప్రధాని క్లేత్ రౌలీ సెక్యూరిటీ ఏజెన్సీస్ తో సమావేశమై ఏమైనా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందా.. భద్రత ఏ విధంగా చేపట్టాలనే అంశాలపై చర్చించారు. బార్బడోస్ కు సంబంధించిన దేశాధికారులు సైతం ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారించారు. అయితే వెస్టిండీస్, అమెరికా రెండు దేశాలు ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచులు బార్బడోస్, గయానా, ట్రినిడాడ్, సెయింట్ లూసియా, సెయింట్ వినిసెంట్ ప్రాంతాల్లో మ్యాచులు జరగనున్నాయి. ఈ స్టేడియాలు, చుట్టు పక్కల ప్రాంతాలు, ఆటగాళ్లు బస చేసే వివిధ హోటల్స్ లో పటిష్ట భద్రత కల్పించనున్నారు.

ఇప్పటికే వరల్డ్ కప్ కోసం అన్ని టీమ్ లు తమ జట్లను ప్రకటించాయి. భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ ఇంగ్లాండ్ లాంటి దేశాలు హాట్ పేవరేట్ గా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియా కేవలం ఒక్క సారి మాత్రమే టీ 20 వరల్డ్ కప్ నెగ్గింది. తర్వాత 2014 లో శ్రీలంకపై ఫైనల్లో ఓడిపోయింది. 2007 తర్వాత ఇంతవరకు వరల్డ్ కప్ గెలవలేదు. ఈ సారి ఎలాగైనా గెలిచి రోహిత్ శర్మ తన కల నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు.

Exit mobile version