JAISW News Telugu

Harish Rao : రుణమాఫీలో కోతలు పెట్టేందుకే నిబంధనలు : హరీశ్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao : రైతు రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన  అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఈ నిబంధన వల్ల చాలా మందికి రుణమాఫీ కావడం లేదని అన్నారు. రుఫమాఫీలో కోతలు పెట్టెందుకే రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈరోజు (సోమవారం) ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు డీఏలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక విభాగాల వైద్యులను జిల్లాలకు బదిలీ చేశారని, అనుభవం ఉన్న వైద్యులను చిన్న ఆస్పత్రులకు బదిలీ చేశారని ఆరోపించారు. ప్రస్తుత విభాగాల్లోనే సూపర్ స్పెషాలిటీ నిపుణులను కొనసాగించాలని, ప్రతిపక్షం ఇస్తున్న సూచనలను ప్రభుత్వం పాటించాలన్నారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను సమర్థించనని హరీశ్ రావు పేర్కొన్నారు.

Exit mobile version