Telangana Bhavan : తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నం

Telangana Bhavan
Telangana Bhavan : హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు కాంగ్రెస్ చేనేత కార్మిక విభాగం నాయకులు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దుబ్బాకలో జరిగిన సమావేశంలో కొండా సురేఖను బీఆర్ఎస్ శ్రేణులు అవమానించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సోషల్ మీడియాలో కొండా సురేఖను బీఆర్ఎస్ శ్రేణులు అవమానించారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మరోసారి అవమానించేలా మాట్లాడితే బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు దిష్టిబొమ్మలు దహనం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మను దహనానికి యత్నించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నాయకులు దాడిచేశారు. ఇరువర్గాల మధ్య కాసేపు తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. భారీగా చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.