
Sai Dharam Tej
Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా ఆయన గెలుపు కోసం మెగా కుటుంబంతో పాటు టాలీవుడ్ నుంచి ప్రచారాని వస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి సినీ హీరో సాయిధరమ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేయడానికి వచ్చారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఆయన కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో తాటిపర్తికి చెందిన జనసైనికుడు నల్లల శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. సాయిధరమ్ తేజ్ పర్యటనకు అనూహ్య స్పందన రావడంతో తట్టుకోలేక వైసాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.