Pedakurapadu : పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో పెదకూరపాడు ఎమ్మెల్యే కొడుకు కళ్యాణ చక్రవర్తి వీరంగం సృష్టించారు. తొడ కొడుతూ, మీసాలు తిప్పుతూ హల్ చల్ చేశారు. క్రోసూరులో ఉన్నవైసీపీ బహిష్కృత నేత కంబంపాటి రాముకు చెందిన కన్సల్టెన్సీ ఆఫీస్ ను ధ్వంసం చేశారు. మరోవైపు మీడియా సమావేశం పెట్టకుండా టీడీపీ నేత కంచేటి సాయిని పోలీసులు అడ్డకున్నారు. రహదారికి అడ్డంగా వాహనాలను పెట్టి సాయిని అడ్డుకున్నారు.
దీంత పెదకూరపాడు ఎమ్మెల్యే అవినీతిపై తాను చర్చకు సిద్ధమని సాయి సవాల్ విసిరాడు. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని అన్నాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొడుకు కళ్యాణ చక్రవర్తి సుమారు 500 మందితో సాయి స్వగ్రామం పీసపాడులో దాడులకు పాల్పడ్డాడు. సాయి కనుక మీడియా సమావేశం పెడితే ఎమ్మెల్సే అవినీతి బాగోతం మొత్తం కూడా బట్టబయలయ్యే అవకాం ఉండడంతో సమావేశాన్ని అడ్డుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశాడు. దీంతో పోలీసులు కంచేటి సాయిని క్రోసూరులో మీడియా సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో సాయి పీసపాడులో మాట్లాడుతూ దమ్ముంటే తన సవాలును ఎమ్మెల్యే స్వీకరించాలని అనడంతో తన తండ్రి పరువు పోతుందని భావించిన ఎమ్మెల్యే కొడుకు 500 మందితో కర్రలు, మారణాయుధాలతో క్రోసూరులోను, పీసపాడులోనూ దాడులు చేస్తూ హల్ చల్ సృష్టించాడు. ఈ సందర్భంగా పోలీసులు కంచేటి సాయిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు దాడికి పాల్పడిన వారిని కనీసం అడ్డుకోక పోడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.