Tension in Armoru : ఆర్మూరులో ఉద్రిక్తత..ఫుట్ పాత్ పై ఆక్రమణల తొలగింపు

Tension in Armoru
Tension in Armoru : నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఫుట్ పాత్ పై ఆక్రమణలు తొలగిస్తుండడంతో ఆర్మూర్ పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆక్రమణ దుకాణాలను తొలగించేందుకు మునిసిపల్ సిబ్బంది వెళ్లగా.. నిర్వాహకులు అడ్డుకున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా షాపులు తొలగిస్తున్నారంటూ పండ్ల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మునిసిపల్ సిబ్బందికి, వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగించారు.