SSC Results 2024 : తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్ బాగ్ లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. పది ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. పది ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదయింది. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 5,05,813 .మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 4 వరకు పది పరీక్షలు జరిగాయి. ఈసారి ఫలితాల్లో నిర్మల్ 99.05 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, వికారాబాద్ 65.10 శాతం ఉత్తీర్ణత సాధించి చివరి స్థానంలో నిలిచింది.