TDP First List : ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ , ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నాలుగు జాబితాల ద్వారా తన అభ్యర్థులను ప్రకటించింది. మరి కొద్ది రోజుల్లోనే మిగతా అభ్యర్థులను ప్రకటించేలా ప్లాన్ చేస్తోంది. ఇక టీడీపీ-జనసేన కూటమి మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన చేయనుందని తెలుస్తోంది. వైసీపీ కి దీటైన అభ్యర్థులను బరిలోకి దించడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ ముందుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా టీడీపీ ఫస్ట్ లిస్ట్ లీక్ అంటూ కొన్ని పేర్లతో కూడిన జాబితా బయటకు వచ్చింది. దీన్ని టీడీపీ హైకమాండ్ అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే ఎన్నికల వేళ ఏ విషయమైన ప్రజల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. దీంతో ఈ లీక్ లిస్ట్ కూడా రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఆ లిస్ట్ లోని నియోజకవర్గాలు, అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి..
ఇచ్చాపురం: బెండాలం అశోక్
టెక్కలి: అచ్చెన్నాయుడు
అముదాలవలస: కూన రవికుమార్
పలాస: గౌతు శిరీష
రాజాం: కొండ్రు మురళీమోహన్
బొబ్బిలి: బేబీ నాయన
విజయనగరం: అశోకగజపతిరాజు
చీపురుపల్లి: కిమిడి నాగార్జున
కురుపం: టి. జగదీశ్వరి
పార్వతీపురం: విజయచంద్ర
వైజాగ్ ఈస్ట్: వెలగపూడి రామకృష్ణ బాబు
వైజాగ్ వెస్ట్: గణబాబు
పాయకరావుపేట: అనిత
నర్సీపట్నం: చింతకాయల విజయ్
తుని: యనమల దివ్య
జగ్గంపేట: జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం: చిన్నరాజప్ప
అనపర్తి: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
రాజమండ్రి అర్బన్: ఆదిరెడ్డి వాసు
రాజమండ్రి రూరల్: బుచ్చయ్య చౌదరి
గోపాలపురం: మద్దిపేట వెంకట్రాజు
ముమ్మడివరం: దత్తాల సుబ్బరాజు
అమలాపురం: బత్తుల ఆనందరావు
మండపేట: వేగుళ్ల జోగేశ్వరరావు
ఆచంట: పితాని సత్యనారాయణ
పాలకొల్లు: నిమ్మల రామానాయుడు
ఉండి: మంతెన రామరాజు
దెందులూరు: చింతమనేని
విజయవాడ ఈస్ట్: గద్దె రామ్మోహన్ రావు
విజయవాడ సెంట్రల్: బొండా ఉమ
నందిగామ: తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట: శ్రీరాం తాతయ్య
మచిలీపట్నం: కొల్లు రవీంద్ర
గన్నవరం: యార్లగడ్డ వెంకట్రావు
పెనమలూరు: కొలుసు పార్థసారధి
మంగళగిరి: నారా లోకేశ్
పొన్నూరు: ధూళిపాళ నరేంద్ర
చిలకూరిపేట: పత్తిపాటి పుల్లారావు
సత్తెన్నపల్లి: కన్నా లక్ష్మీనారాయణ
వినుకొండ: జీవీ ఆంజనేయులు
కాగా, ఈ లిస్టుపై అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. నిన్న, మొన్న జనసేన నేతలు తాము పోటీ చేయబోయే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను వైరల్ చేశాయి. దానికి కౌంటర్ గా టీడీపీ శ్రేణులు ఈ లిస్ట్ ను వైరల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ఆ పార్టీల అంతర్గత పోరు అని తెలుస్తోంది. అయితే చంద్రబాబు, పవన్ అధికారికంగా ప్రకటించే లిస్టే ఫైనల్ అని చెబుతున్నారు. నేతలిద్దరూ ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ నాటికి పూర్తిగా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.