JAISW News Telugu

Tollywood Producer : కిడ్నాప్ కేసులో తెలుగు అగ్ర నిర్మాత

Tollywood Producer

Tollywood Producer : బలవంతంగా షేర్ల బదలాయింపు, యాజమాన్య మార్పిడి వ్యవహారంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యర్నేని  హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఈకేసుల్లో నిందితుల జాబితాలో ఆయన పేరు ముందు ఉండడం గమనార్హం. జూబ్లీహిల్స్ ఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి కథనం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్ తో పాటు పలువురిపై పంజాగుట్టలో కేసు నమోదైంది.

విషయం తెలుసుకున్న ఎన్ఆర్ఐ, వ్యాపారవేత్త చిన్నుపాటి వేణుమాధవ్ జూబ్లీ హిల్స్ పోలీసులను సంప్రదించారు. కేసులోని పలువురు నిందితులు తనను కిడ్నాప్ చేసి బలవంతం చేశారని తెలిసింది. రాధాకిషన్ రావు, గట్టుమల్లు, మల్లికార్జున్ తో పాటు కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ, చంద్రశేఖర్ తో పాటు పలువురు నిందితులను పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా డైరెక్టర్లకు నోటీసులిచ్చి విచారించేందుకు రెడీ అయ్యారు. వేణుమాధవ్, చంద్రశేఖర్ వేగేల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ మీద గతంలో కూడా పీడీ చట్టం ప్రయోగించారు. ఇలా విచారణలో పలు విషయాలు తెలుస్తున్నాయి. దీంతో కేసు పలు మలుపులు తిరుగుతోంది.

ప్రముఖులే ఇలా కేసుల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలు కేసుల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇది కొత్తగా జరిగేదీమీ కాదు. ఈ నేపథ్యంలో కేసును తేల్చడానికి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించి వారికి శిక్ష పడేలా చేయాలని చూస్తున్నారు. ఎంతటి వారైనా తప్పించుకునే వీలు లేదని స్పష్టం చేస్తున్నారు.

ఇలా కేసు సినీ ఫక్కీలో వెళ్తోంది. నిందితుల గుర్తింపులో ఎలాంటి ప్రలోభాలకు గురయ్యేది లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అంటున్నారు. దీంతో కేసు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు.

Exit mobile version