– ఐఏఎస్ అధికారికి ప్రత్యేక అభినందనలు
IAS Krishna Teja : జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం అందుకున్న తెలుగుతేజం, కేరళలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తోన్న కృష్ణతేజ చిలకలూరిపేటకే గర్వకారణం. చిత్తశుద్ధి, నిజాయితీ, అంకితభావంతో సివిల్ సర్వీసెస్‌లో అడుగు పెట్టిన రోజు నుంచి పుట్టినప్రాంతానికి మంచిపేరు తెస్తూనే ఉన్నారు. తెలుగు ఐఏఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజ జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం అందుకోనుండడం ఎంతో సంతోషాన్నిచ్చింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.
డ్రగ్స్‌పై వ్యతిరేక పోరాటంలో భాగంగా బాలల హక్కుల రక్షణలో త్రిస్సూర్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. పాఠశాలలు, విద్యాసంస్థల పరిధిలో మాదకద్రవ్యాల ప్రభావం తగ్గించడం, అక్రమ రవాణను సమర్థంగా అడ్డుకోగలిగారు. ప్రభుత్వ యంత్రాంగాల్ని మొత్తం సమన్వయ పరిచి ఆ విషయంలో తిస్సూర్‌ను దేశంలోనే ఆదర్శంగా నిలపడంతో ఆయనను ఈ పురస్కారం వరించింది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నిర్వహించే కార్యక్రమంలో పురస్కారం అందుకోబోతున్న కృష్ణతేజకు ప్రత్యేక అభినందనలు..
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయన ఎంపిక కావడం హర్షణీయమని తెలిపారు. మరిన్ని సేవలందిస్తూ ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.