ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి ఒక సినిమా ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ పై దారుణమైన ఆరోపణలు చేశాడు. ఆ సమయంలో ఒక్క హీరో కూడా ఇది తప్పు అని స్పందించ లేదు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ టికెట్ల రేటు పెంపు విషయంలో వైయస్ జగన్ తో పోరాటం చేస్తున్న సమయంలో కూడా ఆయన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తప్ప ఆయనకు అనుకూలంగా మాట్లాడలేరు. పోసాని కృష్ణ మురళితో పాటు చాలామంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు.
ఆ సమయంలో ఈ హీరోలంతా ఎక్కడికి వెళ్లిపోయారు అని ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పోరాడింది సినిమా ఇండస్ట్రీ గురించి అయినప్పటికీ ఆయనకు ఎందుకు సహకరించలేదు. ఇప్పుడెందుకు నాగార్జునని ఒక మాట అనగానే అందరూ స్పందిస్తున్నారు. నాగార్జునకు ఒక్క రూల్ పవన్ కళ్యాణ్ లాంటి వారికే మరొక రూల్ అని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా వీరంతా కేవలం ఒకరికి సపోర్ట్ చేస్తూ మరొకరికి వ్యతిరేకంగా ఉంటున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించడానికి సపోర్ట్ చేయకపోవడం వెనుక
కారణాలేమిటి? నాగార్జునను అతని కుటుంబాన్ని ఒక్క మాట అనగానే అందరూ స్పందిస్తుండడానికి కారణం ఏమిటని అందరూ చర్చించుకుంటున్నారు. మొత్తం మీద వీరంతా రీలు హీరోలని రియల్ హీరోలు కాదని కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే మద్దతు ప్రకటిస్తారని మరికొన్ని సందర్భాల్లో ఎంత పెద్ద గొడవలు జరిగిన ఏమాత్రం సపోర్ట్ చేయరని ఈ విషయం ద్వారా స్పష్టంగా అర్థం అవుతుంది.