US Theft Case : యూఎస్ చోరీ కేసులో పట్టుబడిన తెలుగమ్మాయిలు
US Theft Case : చక్కగా చదువుకోమని తల్లిదండ్రులు అమెరికాకు పంపుతుంటే వారెళ్లి అక్కడ చోరీలకు పాల్పడుతున్నారు. పరిస్థితులు నేపథ్యంలో జరిగిందా? లేదంటే కావాలనే చేశారా? తెలియదు కానీ తెలుగు వారి పరువు మాత్రం తీశారన్న ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లే వారి సంఖ్య పెరుగుతుండడంతో అందులో కొందరు ఇలాంటి వారు కూడా వెళ్తున్నారన్న వాదనలు కూడా పెరుగుతున్నాయి. అమెరికాలో చోరీ కేసులో పట్టుబడ్డ తెలుగు అమ్మాయిలు కారం మానసా రెడ్డి, పులియాల సింధూజారెడ్డి ఉదంతాన్ని గురించి తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని డల్లాస్ లోని ప్రఖ్యాత మ్యాసీస్ మాల్ లో చోరీ జరిగింది. ఈ చోరీ చేసిన ఇద్దరు అమ్మాయిలు పట్టుబడ్డారు. మాల్ లో వస్తువులను దొంగిలిస్తూ పట్టుబడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాల్ లో కొనుగోలు చేసిన కొన్ని వస్తువులకు వారు డబ్బులు చెల్లించలేదు.
ఆ తర్వాత వారిద్దరినీ పోలీసులు విడిచిపెట్టినప్పటికీ ఇందులో మానస అలవాటైన నేరస్తురాలని, గతంలో కూడా పలు చోరీ కేసుల్లో ఆమె అరెస్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు తెలుగు అమ్మాయిలు చేసిన ఈ ఉదంతం విదేశాల్లోని యావత్ తెలుగు సమాజంపై తీవ్ర వ్యతిరేకతను రేకెత్తిస్తుంది. ఇలాంటి ప్రవర్తన తెలుగు విద్యార్థి సంఘం ప్రతిష్టను మరింత దిగజార్చుతుంది. దీనిపై ఆయా కుటుంబాల పెద్దలు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటి వరకు తెలుగు సమాజం అంటే అమెరికాలో మంచి గుర్తింపు ఉందని, ఇలాంటి ఘటనలతో వారి ప్రతిష్ట దిగజారుతుందని పలువురు తెలుగువారు మండిపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే తెలుగు సమాజం, తెలుగు అసోసియేషన్లను కలిస్తే ఉద్యోగాలు కల్పిస్తారని కానీ ఇలాంటి చోరీలు చేస్తే దిక్కు లేదని దేశంలో అరెస్టులు తప్ప చేసేదేం లేదన్నారు.