JAISW News Telugu

Telugu Girl in Hollywood : హాలీవుడ్ ను ఔరా అనిపిస్తున్న తెలుగమ్మాయి.. ఆమె ఎవరో తెలుసా?

Telugu girl in Hollywood

Telugu girl in Hollywood

Telugu girl in Hollywood : ‘‘అమ్మ చేసింది మిస్.. లైట్ గానే ఉంటుంది..’’ అంటూ టీవీల్లో వచ్చే యాడ్ అందరూ చూసే ఉంటారు. అందులో కనిపించిన చిన్నారి గుర్తుంది కదా. ‘బ్రహ్మోత్సవం’లో మహేశ్ బాబు కజిన్ గా, ‘రారండోయ్ వేడుక చేద్దాం’ లో చిన్నప్పటి రకుల్ గా .. తన నటనతో అలరించిన ఆ పాపే..అవంతిక వందనపు. ఇప్పుడీమె హాలీవుడ్ లో నటిస్తూ సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయింది.

అవంతిక పుట్టి పెరిగింది అంతా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో. స్వస్థలం హైదరాబాద్. తండ్రి శ్రీకాంత్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. తల్లి అనుపమ రెడ్డి. అకౌంటెంట్, రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆవిడకు శాస్త్రీయ కళలపై మక్కువ ఎక్కువ. అందుకే తమ కూతురికి మూడేళ్ల నుంచే డ్యాన్స్, సంగీతం నేర్పించారు. అవంతిక వాటినే కెరీర్ గా ఎంచుకోవాలనుకోవడంతో తల్లి ప్రోత్సహించింది. అవంతిక నటిగానే కాదు, డ్యాన్సర్ గా, సింగర్, మోడల్ గా గుర్తింపు పొందింది.

ఓ ఇండియన్ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో( నార్త్ అమెరికా)లో రెండో స్థానం గెలుచుకున్న తర్వాత అవంతిక కెరీర్ ప్రారంభమైంది. మహేశ్ బాబు బ్రహ్మోత్సవంలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాత వాసి వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మూస పాత్రలు వస్తున్నాయని చెప్పి చాలెంజింగ్ రోల్స్ చేయాలని హాలీవుడ్ బాట పట్టింది.

ముందుగా అమెరికన్ కన్సర్వేటరీ థియేటర్ లో నటనా తరగతులకు హాజరై పట్టు తెచ్చుకుంది. డిస్నీ చానల్ ‘స్పిన్’ చిత్రం కోసం ఆడిషన్స్ కు హాజరై ఓ ఎన్ఆర్ఐ పాత్రను వేసింది. దీనికి ప్రశంసలు వచ్చి అవకాశాలు వరుసకట్టాయి. తాజాగా ‘మీన్ గర్ల్స్’ చిత్రం విజయం సాధించడంతో ఆమె మంచి పేరు వచ్చింది. దీంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇదంతా ఒక్క రోజులో వచ్చింది కాదు అని.. తాను ఎంతో కష్టపడ్డానని, వర్ణవివక్షను అనుభవించానని అవంతిక తెలిపింది. ఇంకా ఎన్నో సినిమాల్లో తనకు అవకాశాలు వస్తున్నాయని, మరికొన్ని రిలీజ్ కావాల్సి ఉందని చెబుతోంది. ఎంతో మంది హాలీవుడ్ రివ్యూయర్స్ తన నటనను మెచ్చుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది.

Exit mobile version