Hit Six Sixes : టీ20 యుగంలో చాలా మంది బ్యాటర్లు అవ లీలగా సిక్సర్లు బాదేస్తున్నారు. ఒక ఓవర్‌లో రెండు లేదంటే మూడు నాలుగు సిక్స్‌లను కొట్టేస్తున్నారు. అయితే.. ఓవర్‌లోని ఆరు బంతులకు ఆరు సిక్స ర్లు కొట్టడం అన్నది అత్యంత అరుదు అని చెప్పవ చ్చు. 2007లో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ టీమ్ఇండి యా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆరు బంతు లను ఆరు సిక్సర్లుగా మలిచాడు. దీన్ని అభిమా నులు అంత త్వరగా మరిచిపోరన్న సంగతి తెలిసిందే.
తాజాగా కల్నల్ సీకే నాయుడు అండర్ -23 క్రికెట్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వంశీకృష్ణ ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లను కొట్టాడు. ఆంధ్ర జట్టు ఓపెనర్ అయిన మామిడి వంశీకృష్ణ రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో 64 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 110 పరుగులు చేశాడు. గుంటూరు కు చెందిన ఈ కుర్రాడు ధమన్‌దీప్ సింగ్ వేసిన ఓవర్‌లో ఆరు బంతులను ఆరు సిక్సర్లుగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో యువరాజ్ సింగ్ (భారత్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్), వన్డేల్లో హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), జస్కరణ్ మల్హోత్రా (అమెరికా) లు ఉన్నారు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రవిశాస్త్రి (భారత్), గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్). లీ జెర్మన్ (న్యూజిలాండ్), దేశవాలీ టీ20ల్లో లియో కార్టర్ (న్యూజిలాండ్), రోజ్‌వైట్లీ (ఇంగ్లాండ్), హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) లు ఉన్నారు. ఇక దేశవాలీ వన్డేల్లో రుతురాజ్ గైక్వాడ్ (భారత్), తిసారా పెరీరా (శ్రీలంక) లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టారు.