JAISW News Telugu

JEE Mains 2024 : జేఈఈ మెయిన్స్ లో తెలుగు సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్

JEE Mains 2024

JEE Mains 2024

JEE Mains 2024 : జేఈఈ మెయిన్స్-2024 (సెషన్‌-2) ఫలితాలు ఇటీవల రిలీజ్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు దక్కించుకోగా.. వీరిలో 22 మంది తెలుగు విద్యార్థులు ఉండడం విశేషం. మళ్లీ ఇందులో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి 7 గురు ఉన్నారు. ఏప్రిల్‌ 22న జేఈఈ మెయిన్ తుది కీ రిలీజ్ చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA).. నిర్ణయించిన షెడ్యూల్ కన్నా రోజు ముందే రిజల్ట్స్‌ ను వెబ్ సైటులో ఉంచింది. విద్యార్థులు అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి స్కోర్ కార్డులను తెలుసుకోవచ్చు.

సెషన్-1లో 23 మందికి 100 పర్సంటైల్!
జనవరిలో జరిగిన సెషన్‌-1 పరీక్షకు 12,21,624 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 23 మంది 100 పర్సంటైల్‌ సాధించి సత్తా చాటారు. ఏప్రిల్‌ 4 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగిన JEE Main సెషన్‌ 2 పరీక్షకు 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మొత్తంగా 2 సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన స్కోర్ ను పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ (NTA) మెరిట్‌ లిస్ట్‌ రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ కూడా ప్రకటించింది. రాష్ట్రాల వారీగా టాపర్స్ వీరే..

100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులు
1. హందేకర్‌ విదిత్‌
2. వెంకట సాయి తేజ మదినేని
3. ముత్తవరపు అనూప్‌
4. రోహన్‌ సాయి బాబా
5. కేసం చన్న బసవ రెడ్డి
6. రెడ్డి అనిల్‌
7. శ్రీయాశస్‌ మోహన్‌ కల్లూరి
8. రిషి శేఖర్‌ శుక్లా
9. మురికినాటి సాయి దివ్య తేజ రెడ్డి
10. పొలిశెట్టి రితిష్‌ బాలాజీ
11. తవ్వ దినేశ్‌ రెడ్డి
12. గంగ శ్రేయాస్‌
13. దొరిసాల శ్రీనివాస రెడ్డి
14. తమటం జయదేవ్‌ రెడ్డి
15. మావూరు జస్విత్‌

100 పర్సంటైల్‌ సాధించిన ఏపీ విద్యార్థులు..
1. చింటు సతీష్‌ కుమార్‌
2. మకినేని జిష్ణు సాయి
3. షేక్‌ సురజ్‌
4. తోట సాయి కార్తీక్‌
5. తోటంశెట్టి నిఖిలేష్‌
6. అన్నరెడ్డి వెంకట తనిష్‌ రెడ్డి
7. మురసాని సాయి యశ్వంత్‌ రెడ్డి

27 నుంచి దరఖాస్తులు
మెయిన్‌లో కటాఫ్‌ మార్స్క్ సాధించిన 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే వీలు ఉంటుంది. JEE Advanced పరీక్షకు ఏప్రిల్‌ 27 నుంచి మే 7వతేదీ వరకు ఐఐటీ మద్రాస్‌ దరఖాస్తులు స్వీకరిస్తుంది. మే 17 నుంచి 26వ తేదీ వరకు అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌ -1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ -2 పరీక్ష నిర్వహిస్తారు. వాటి ఫలితాలను జూన్‌ 9న ప్రకటిస్తారు. 

124078847-file

Exit mobile version