liquor sales : తెలంగాణ రాష్ర్టంలో మద్యం విక్రయాలు మరోసారి సరికొత్త రికార్డును నమోదు చేశాయి. విజయ దశమి పండుగ సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో మరోసారి రికార్డు స్థాయిలో జరిగాయి. పండగ జరిగిన పది రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు వెయ్యి కోట్లకు పైగా లిక్కర్ సేల్స్ జరిగాయి. బార్లు, మద్యం దుకాణాలతో పాటు పబ్బుల్లోనూ విక్రయాలు విపరీతంగా పెరిగాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు మద్యం డబ్బులతో గలగలలాడింది. హైదరాబాద్ నగరంలో ఈసారి విక్రయాలు బాగా సాగినట్లు అధికారులు తేల్చారు. దసరా రోజుతో పాటు మరుసటి రోజైన ఆదివారం కూడా అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. మొత్తంగా ఈ 11 రోజుల్లో తెలంగాణలో దాదాపు 1100 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నారు. మద్యం విక్రయాలు మరోసారి రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం తెచ్చి పెట్టాయి.
ఇవీ లెక్కలు.!
తెలంగాణ రాష్ట్రంలో 2,260 మద్యం దుకాణాలు ఉండగా, 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు నడుస్తున్నాయి. వీటితో పాటు పబ్బుల్లోనూ లిక్కర్ సేల్స్ జరగుతున్నాయి. తెలంగాణలో ఏటా దసరా సందర్భంగా మద్యం విక్రయాలు భారీగానే సాగుతుంటాయి. ఈసారి కూడా అదే అంచనాతో ఎక్సైజ్ శాఖ ముందస్తుగా భారీగా మద్యం స్టార్ సిద్ధం చేసి పెట్టింది. బార్లు, వైన్ షాపుల్లో భారీగా నిల్వలు ఉంచారు. దసరా ప్రారంభానికి ముందే లిక్కర్ సేల్స్ మొదలైంది. అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ.1,057.42 కోట్ల విలువైన 10.44 లక్షల కేసుల లిక్కర్ సేల్స్ జరిగినట్లు ఆబ్కారిశాఖ అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
సోషల్ మీడియాలో మీమ్స్
తెలంగాణలో మద్యం విక్రయాలపై సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. దసరా వేళ సాగిన విక్రయాలపైనా మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మద్యం విక్రయాల్లో ఏపీ, తెలంగాణతో నెటిజన్లు పోల్చుతున్నారు.
అయితే ఈ లిక్కర్ సేల్స్ ఫిగర్ ను ఏపీ సంక్రాంతికి దాటేస్తుంటూ మీమ్స్ పెడుతూ తెగ నవ్విస్తున్నారు.