Telangana Weather : తెలంగాణ నిప్పుల కుంపటిలా మారుతోంది. భానుడి ధాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8 గంటలకే కొర్రాయిలా కనిపిస్తోంది. గత 110 ఏళ్లలో ఇంతటి వేడి చూడలేదని అంటున్నారు. రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. మరో నాలుగైదు రోజులు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందంటున్నారు. వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సూర్యుడి ప్రతాపం చూడలేకపోతున్నారు. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈనెల 5వ తేదీ వరకు ఎండలు విపరీతంగా ఉంటాయని చెబుతున్నారు. ఎండల ప్రభావంతో వడదెబ్బలు సోకే ప్రమాదముందని తెలియజేస్తున్నారు.
రాష్ట్రంలోని జిల్లాల్లో 43 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, తూర్పు జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. రానున్న రోజుల్లో ఎండ వేడి ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల ధాటికి జనం బయటకు రావొద్దని చెబుతున్నారు. ఒకవేళ రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఉన్ని దుస్తులు ధరించాలి. నెత్తికి టోపీ ధరించాలి. నీళ్ల సీసా వెంట ఉంచుకోవాలి. ద్రవ పదార్థాలు తీసుకోవాలి. మసాలాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎండలో తిరగొద్దు. పని కూడా చేయొద్దు. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం ఉంటుంది. అందుకే జాగ్రత్తలు తీసుకుని ఎండలో బయటకు వెళ్లకుండా చూసుకోవాలి.
ఈ సంవత్సరం ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. అత్యవసర పనులు ఉంటే ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవాలి. మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. ఒకవేళ వెళ్లినా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే వడదెబ్బ సోకితే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది.