Telangana:తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజజాన్ని సొంతం చేసుకుంది. దీంతో అధికార మార్పిడి అనివార్యంగా మారింది. మరి కొన్ని గంటల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న ఈ నేపథ్యంలో బీఆర్ ఎస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ పదవులు అనుభవించిన చైర్మన్లు ఒక్కొక్కరుగా తమ పదవులకు రాజీనామాలు సమర్పిసతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ్పడుతున్న సందర్భంగా చైర్మన్ల రాజీనామాల పర్వం మొదలైంది. తమ రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు.
రాజీనామా చేసిన చైర్మన్లు వీరే..
1. సోమ భరత్ కుమార్
చైర్మన్, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్
2. జూలూరి గౌరీ శంకర్
చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ
3. పల్లె రవికుమార్ గౌడ్
చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్
4. డాక్టర్ ఆంజనేయ గౌడ్
చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ
5. మేడె రాజీవ్ సాగర్
చైర్మన్, టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్
6. డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్,
వైస్ చైర్మన్ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ
7. గూడురు న్రవీణ్
చైర్మన్, టెక్స్ టైల్స్ కార్పొరేషన్
8. గజ్జెల నగేష్
చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్
9. అనిల్ కూర్మాచలం
చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్
10. రామచంద్ర నాయక్
చైర్మన్, ట్రైకార్
11.విలియా నాయక్
చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ
12. వై. సతీష్ రెడ్డి
చైర్మన్, రాష్ట్ర పునరుత్పాదక సంస్థ
13. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
14. రవీందర్ సింగ్
చైర్మన్, పౌర సరఫరాల సంస్థ.
15. జగన్మోహన్ రావు
చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్
వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా చేశారు.