BRS:ఆర్మూర్ బీఆర్ఎస్‌లో ముదురుతున్న ముస‌లం

BRS:ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీలో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ పండిత్ వినీత‌పై సొంత పార్టీ కౌన్సిల‌ర్లు తిరుగుబాటు చేశారు. ఆమెపై విశ్వాసం పెట్టాలంటూ జిల్లా క‌లెక్ట‌ర్ రాజీవ్‌గాంధీ హ‌నుమంతుకు విన‌తిప‌త్రం అంద‌జేశారు. మొత్తం 36 మంది కౌన్సిల‌ర్ల‌కు గాను 24 మంది అవిశ్వాసానికి సిద్ధ‌మ‌య్యారు. అభివృద్ధి ప‌నులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. ఆమెపై అవిశ్వాసం ప్ర‌క‌టించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు. రెండు రోజుల ముందు మాజీ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డిని క‌లిసి ప‌రిస్థితిని బీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు వివ‌రించారు.

వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి..

ఆర్మూర్‌లో బీఆర్ఎస్ కౌన్సిల‌ర్‌ల వివాదం ఇలా ఉంటే మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి వివాదం మ‌రోలా ఉంది. ఆయ‌న తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఆయ‌న చుట్టు ఉచ్చుబిగుస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. కోట్ల‌ల్లో ఆయ‌న షాపింగ్ మాల్ విద్యుత్ బాకాయిలు ఉన్నాయ‌ని అధికారులు ఇటీవ‌ల ఆర్మూర్‌లోని జీవ‌న్‌రెడ్డికి చెందిన షాపింగ్ మాల్‌కు క‌రెంట్ క‌ట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే.

అంతే కాకుండా తాజాగా ఆయ‌న‌కు మ‌రో షాక్ త‌గిలింది. త‌మ వ‌ద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వ‌డ్డీ రూ. 25 కోట్లు క‌లిపి మొత్తం రూ.45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ అధికారులు తాజాగా జీవ‌న్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ మేర‌కు ఆర్మూర్‌లోని జీవ‌న్‌రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. 2017లో మాజీ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి త‌న స‌తీమ‌ణి పేరుమీద స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లో రూ.20 కోట్లు రుణం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బ్బు చెల్లించ‌లేదు. దీంతో అస‌లు, ప్ల‌స్ వ‌డ్డీ క‌లిపి రూ.45 కోట్ల బ‌కాయిలు ఉన్నాయ‌ని ఇటీవ‌ల అధికారులు తెలిపారు. అంతే కాకుండా జీవ్‌రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

TAGS