Telangana police : రాజస్థాన్ లో తెలంగాణ పోలీసుల ఆపరేషన్.. సైబర్ నేరగాళ్ల అరెస్టు
Telangana police : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు రాజస్థాన్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో 27 మంది సైబర్ నేరస్తులను అరెస్టు చేసి వారి నుంచి భారీగా చెక్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మధ్యాహ్నం 3 గంటలకు ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
కాగా, రాజస్థాన్ లోని పింప్రీ చించ్ వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సీనియర్ సిటిజన్ ను కోటి రూపాయలకు పైగా మోసం చేసిన నిందితుడని పోలీసులు అరెస్టు చేశారు. జైపూర్ కు చెందిన మయాంక్ అశోక్ కుమార్ గోయల్ (20) తన స్నేహితులతో కలిసి ఎస్బీఐ, సీబీఐ ఉద్యోగులమని చెప్పి మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితెలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ సందీప్ దోయిఫోడ్ వెల్లడించారు.