UPSC CSE Results 2023 : తెలంగాణకు చెందిన దోనూరి అనన్య రెడ్డి యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ఫలితాల్లో మూడో ర్యాంక్ సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆమె మొదటి అటెంప్ట్ల్ లోనే ఉత్తమ ర్యాంక్ సాధించడం విశేషం. ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ రోజుకు 12 నుంచి 14 గంటలు చదివినట్లు తెలిపారు. ఆంత్రోపాలజీకి మాత్రం కోచింగ్ తీసున్నానని అన్నారు. చిన్నతనంలోనే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నానని, సమాజానికి సేవ చేయాలనే ఆశయంతోనే చదివానని తెలిపారు.
సివిల్స్ పరీక్షలో ఈసారి 1016 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో ఆదిత్య ఎవాత్సవ ఆల్ ఇండి ఫస్ట్ ర్యాంక్ ను సాధించారు. అనిమేష్ ప్రధాన్ రెండో ర్యాంక్ సాధించగా దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంక్ సాధించారు. 180 మంది ఐఏఎస్, 200 మంది ఐపీఎస్, 37 మంది ఐఎఫ్ ఎస్ సర్వీసులకు ఎంపికైనట్లు యుపిఎస్సీ తెలిపింది.