Telangana Election Result:తెలంగాణ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో తేల బోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు? అధికార బీఆర్ఎస్ పార్టీలో మళ్లీ అధికారాన్ని చేపట్టి హ్యాట్రిక్ సాధిస్తందా? లేక ఎగ్టిట్ పోల్స్ ప్రకారం కాగ్రెస్ పార్టీనే అనూహ్యంగా విజయం సాధించి తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా? అన్నది తీవ్ర ఉత్కంఠతగా మారింది. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119. అయితే అధికారాన్ని చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు మాత్రమే.
ఒక్క నార్టీకి అనుకున్న స్థాయిలో 60 స్థానాలు దక్కినా అధికారం నల్లేరు మీద నడకే. దీంతో హోరా హోరీగా సాగిన పోరులో అధికార బీఆర్ఎస్ లేదా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ అధికారాన్ని చేపడుతుందా? అన్నది ఉత్కంఠగా మారింది. మరి కొన్ని గంటల్లో ఫలితాల తేల నున్న నేపథ్యంలో ఓటింగ్‌కు సర్వం సిద్ధం అయింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 40 కంపనీల కేంద్ర బలగాలతో బందోబస్తుని ఏర్పాటు చేశారు.
పోస్టల్ బ్యాలెట్ల కోసం 500 ఓట్లకు ఒక టేబుల్ చొప్పున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తయి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుండటంతో పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు అభ్యర్థుల భవితవ్యం తేలబోతోంది. ఆ సమయం వరకు ఓటింగ్ సరలి, ఏ పార్టీ గెలవబోతోందనే విషయాల్లో స్పష్టత రానుంది. దీంతో సర్వత్రా టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా 49 కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్ మొదలవుతోంది. తొలి ఫలితం భద్రాచలం, చార్మినార్ నుంచి వెలువడే అవకాశం ఉందని సమాచారం. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర నలుగురు ఎన్నికల ఇబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం రౌండ్స్ 2,417. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చివరగా శేరిలింగంపల్లి ణలితం వచ్చే అవకాశం ఉంది. ప్రతి 15 నిమిషాలకు ఒక రౌండ్ పూర్తి కానుంది. ఉదయం 8:30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 2.36 కోట్ల మంది తీర్పు ఎలా ఉండబోతోంది? ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారు అన్నది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.