Vijayashanthi : పార్టీలో చేరగానే పెద్ద పదవి కొట్టేసిన విజయశాంతి

Vijayashanthi : విజయశాంతికి పార్టీ మారగానే పదవి వచ్చింది. బీజేపీలో ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో అలక వహించి తిట్టి బయటకొచ్చిన రాములమ్మకు కాంగ్రెస్ ఆహ్వానం పలికింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విజయశాంతికి రాగానే పెద్ద పదవినే ఇచ్చారు.

కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ తన ‘తల్లి తెలంగాణ’ విలీనం చేసి టీఆర్ఎస్ లో నంబర్ 2గా వెలుగొందరు విజయశాంతి. టీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు. టీఆర్ఎస్ లో పలు పదవులు అనుభవించారు.

తర్వాత కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి.. అనంతరం ఎన్నికల వేళ ఆ పార్టీ నచ్చక తిరిగి బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు మరోసా బీజేపీ విధానాలు నచ్చలేదంటూ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ లో అయినా కలకాలం కొనసాగుతారా? లేదా? అన్నది వేచిచూడాలి.

కాంగ్రెస్ లో చేరగానే విజయశాంతికి పెద్ద పదవి దక్కింది. తెలంగాణ ఎన్నికల ప్రచార, ప్లానింగ్ కమిటీ ఛీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్ గా విజయశాంతిని కాంగ్రెస్ నియమించింది. ఈమెతోపాటు టికెట్ దక్కని పలువురిని ఈ కమిటీలో వేసి వారికి ప్రచార బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించింది.

ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారో కింద చూసి తెలుసుకోవచ్చు. 

 

TAGS