Sonia Gandhi:లోక్‌సభ ఎన్నికలు..సోనియా అక్కడి నుంచే బరిలోకి?
Sonia Gandhi:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి అధికారాన్ని హస్తం గుర్తు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకోవడం, ఊహించని విధంగా రేవంలత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎన్నికల్లో తెలంగాణ ప్రజల నుంచి పార్టీకి పూర్తి మద్దతు లభించడం, అనూహ్యంగా అత్యధిక స్థానానల్ని దక్కించుకోవడంతో రానున్న లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇప్పటికే లోక్ సభ ఎన్నికల కోసం భారీగా కసరత్తును ప్రారంభించింది. అభ్యర్థులకు సంబంధించిన కసరత్తును ముమ్మరం చేసింది. అంతే కాకుండా ఇదే ఊపులో లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచే అధినేత్రి సోనియా గాంధీని పోటీ చేయించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సోనియా తెలంగాణలో పోటీ అనే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తోంది. అ నేపథ్యంలోనే సోనియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
మల్కాజ్‌గిరి నుంచి…
లోక్‌సభ ఎన్నికలు సమీపుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదుపుతోంది. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడంతో అధినేత్రి సోనియాను ఇక్కడి నుంచే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దింపాలని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను వీలైనంత త్వరగానే అమల్లోకి తీసుకురావాలని, తద్వారా ఓటు బ్యాంకును మరింత పెంచుకుని లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో సోనియాని బరిలోకి దించాలని, అందుకు మల్కాజ్‌గిరి నియోజక వర్గం సరైనదని భావిస్తున్నారట. సోనియా కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే.. తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు మరింత దూకుడుగా ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.