Telangana Bhavan : చేతిలో బలముంటే మొండి కొడవలైన తెగుతుందంటారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కు ప్రస్తుతం వాస్తు దోషం పట్టిందని చెబుతున్నారు. దీంతోనే ఓటమి పాలైనట్లు వెల్లడిస్తున్నారు. వాస్తు సరిగా లేకపోతే రెండు సార్లు ఎలా అధికారం సాధ్యమైందని అడిగేవారున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ కు ఇలాంటి స్థితి రావడం వాస్తు సమస్యతోనే అని చెప్పడం విడ్డూరమే.
బీఆర్ఎస్ కార్యాలయ వాస్తు కరెక్ట్ గా లేదంటున్నారు. అధికారం కోల్పోగానే వాస్తు దోషం ఉందని నమ్మడం సహజమే. దీంతో వాయువ్య గేటు నుంచి కాకుండా ఈశాన్య గేటు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ఈశాన్య గేటుకు లక్ష్మీనరసింహ స్వామి ఫొటోను తగిలించారు. దీంతో వాస్తు దోషం పోతుందంటున్నారు. ఇలా వాస్తును నమ్ముతూ మార్పులు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావాలంటే వాస్తు మార్పులు అనివార్యమని వాస్తు పండితులు సెలవిచ్చారట. దీంతో కార్యాలయాన్ని మారుస్తున్నారు. ఈశాన్య గేటు పని చేయడం వల్ల వాయువ్య గేటుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 బిజీగా ఉండే రోడ్డు కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమే.
తెలంగాణ భవన్ కు వాస్తు మెరుగులు దిద్దుతున్నారు. ఆ పనులు పూర్తయ్యే వరకు కేసీఆర్ అక్కడకు రావడానికి ఇష్టపడడం లేదంటున్నారు. రెండు సార్లు తిరుగులేని పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా వాస్తు గుర్తుకు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులు చేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి విజయం రావాలని ఆకాంక్షిస్తోంది. ప్రస్తుతం నేతలు కాంగ్రెస్ లోకి వలసలు పోతుండటంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సింది పోయి విమర్శలకు దిగడం వారి అనైతికతకు అద్దం పడుతోంది. నేతలు పోకుండా జాగ్రత్త పడాల్సింది పోయి వారిపై విమర్శలు చేయడం సరైంది కాదనే అభిప్రాయాలు వెల్లువెత్తుతుండటం విశేషం.