Telangana : తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. 35 కార్పొరేషన్ల బాధ్యుల లిస్ట్ ను ఈ రోజు (జూలై 8 – సోమవారం) రిలీజ్ చేసింది. ఎన్నికలకు ముందే చైర్మన్లను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిపివేసి, తాజాగా విడుదల చేశారు.
ఏఏ కార్పొరేషన్ కు ఎవరెవరంటే
01. విత్తనాభివృద్ధి చైర్మన్ గా అన్వేష్‌రెడ్డి
02. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్ ప్రీతం
03. బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నూతి శ్రీకాంత్
04. ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గా బెల్లయ్య నాయక్
05. ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కాసుల బాలరాజు
06. ఆయిల్ సిడ్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి
07. రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ గా మోహన్‌రెడ్డి
08. గిడ్డంగులు సంస్థ చైర్మన్ గా నాగేశ్వరరావు
09. ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గా జ్ఞానేశ్వర్ ముదిరాజ్
10. మత్స్యసహకార సమాక్య చైర్మన్ గా మెట్టు సాయికుమార్
11. గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా రియాజ్
12. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పొదెం వీరయ్య
13. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా కాల్వ సుజాత
14. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా గురునాథ్ రెడ్డి
15. సెట్ విన్ చైర్మన్ గా గిరిధర్‌రెడ్డి
16. కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ గా జనక్ ప్రసాద్
17. నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా విజయ్‌బాబు
18. హస్త కళల అభివృద్ధి చైర్మన్ గా నాయుడు సత్యనారాయణ
19. ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా అనిల్
20. టీజీఐఐసీ చైర్ పర్సన్‌గా నిర్మలా జగ్గారెడ్డి
21. వాణిజ్య ప్రోత్సాహక కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా ప్రకాశ్‌రెడ్డి
22. సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మన్నె సతీష్ కుమార్
23. పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నరసింహారెడ్డి
24. శాతవాహన పట్టాణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా కే నరేందర్‌రెడ్డి
25. కాకతీయ పట్టాణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా వెంకటరామిరెడ్డి
26. రహదారి అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మల్రెడ్డి రామిరెడ్డి
27. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పటేల్ రమేశ్‌రెడ్డి
28. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ గా ఎంఏ ఫహిమ్
29. మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్స్‌న్‌గా శోభారాణి
30. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఎం వీరయ్య
31. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా శివసేనారెడ్డి
32. సంగీత నాట్య అకాడమీ చైర్ పర్సన్‌గా అలేక్య పుంజాల
33. గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గా కే తిరుపతి
34. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా జైపాల్
35. మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఎంఏ జబ్బార్
గత అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసిన వారికే నామినేటెడ్ పోస్టుల్లో ప్రియారిటీ కల్పించారు. ఈ పోస్టుల పట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.