Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నపై వేటు

Teenmar Mallanna
Teenmar Mallanna : కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నను సస్సెండ్ చేస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. షోకాజ్ నోటీసులకు సరైన సమాధానం చెప్పకపోవడంతో తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గత కొంత కాలంగా తీన్మార్ మల్లన్న పార్టీ లైన్ ను ధిక్కరిస్తూ ప్రభుత్వంపైనా, ఒక సామాజికవర్గంపైనా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయని నేతలు క్రమశిక్షణ సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ముందుగా ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు.
అయితే ఈ షోకాజ్ నోటీసులకు కూడా తీన్మార్ మల్లన్న ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన నేపథ్యంలో ఆయనపై వేటు వేసింది