Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

Hyderabad Metro
Hyderabad Metro : మెట్రో రైళ్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్తుండగా హైదరాబాద్ మెట్రో రైలు బేగంపేట స్టేషన్ లో దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. తలుపులు మూసుకోకపోవడంతో రైలు కదలలేదని సమాచారం. అయితే విద్యుత్ ఫీడర్ ఛానల్ లో సాంకేతిక సమస్య వచ్చిందని మెట్రో అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
రైళ్ల ఆలస్యంతో స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. రైలు 15 నిమిషాల పాటు స్టేషన్ లోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. భారీ వర్షాల సమయంలో కూడా మెట్రోలో సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది.