Ghatikachalam : ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్ తో కలిసి ‘ఘటికాచలం’ సినిమా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నారు. నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం డైనమిక్ ద్వయాన్ని ఆకట్టుకుంది. ఈ గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో బజ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్తుంది. ఈ రోజు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో స్ట్రైకింగ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. సూపర్ నేచురల్ సస్పెన్స్, ఇంటెన్స్ డ్రామా మేళవింపుగా ఈ టీజర్ ఉంటుంది.
నిఖిల్ దేవాదుల పాత్రలో కనిపించిన కౌశిక్ డైలాగ్స్ భయానకవాతావరణంలోకి తీసుకెళ్తాయి. ఈ డైలాగ్ అయోమయాన్ని సృష్టిస్తుంది. తర్వాత తన కొడుకును ఆదర్శ విద్యార్థిగా వర్ణించే ప్రభాకర్ పాత్ర అతనిపై గర్వాన్ని వ్యక్తం చేసే సన్నివేశం ఉంటుంది. నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో ఓ అతీంద్రియ మిస్టరీతో కూడుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అసాధారణంగా ప్రవర్తించమని ఎవరో తనను బలవంతం చేస్తున్నారనే అస్థిరమైన భావనతో అతను కొట్టుమిట్టాడుతాడు.
ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న టీజర్ అంచనాలను కొత్త స్థాయికి పెంచుతుంది. థ్రిల్స్, కూల్ ను సమర్ధవంతంగా మేళవించిన ఈ టీజర్ ఒక సూపర్ నేచురల్ సినిమా వాతావరణంలోకి తీసుకెళ్తుంది. బ్యా గ్రౌండ్ స్కోర్, టాప్ విజువల్స్ గ్రిప్పింగ్ గా ఉంటాయి. ఇందులో నిఖిల్ దేవాదులను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించారు- ఒకటి అమాయకత్వాన్ని, మరొకటి భయానకాన్ని చూపించాడు.
గతంలో బాహుబలి: ది బిగినింగ్, బాబు బాగా బిజీ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిఖిల్ దేవాదుల కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఘటికాచలం’. ఈ చిత్రానికి అమర్ కామేపల్లి స్క్రీన్ ప్లే రైటర్, దర్శకుడిగా వ్యవహరిస్తుండగా.. ఎంసీ రాజు కథ అందించారు. ఫ్లావియో కుకురుల్లో సంగీతం, ఎస్ఎస్ మనోజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనిల్ పోగారు ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చూస్తున్నారు. సమ్యు రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఘటికాచలం ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు.