Charlie Chaplin : పొట్టచెక్కలు చేసిన చాప్లిన్ జీవితంలో కన్నీటిధారలు!
Charlie Chaplin : నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్. ఆయన సినిమాలంటే అందరికీ ఇష్టమే. కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా ఆయన సినిమాలు చూస్తే వాటిని మరిచిపోయేవారు. అంతటి మహోన్నత నటుడు చాప్లిన్. చేతిలో కర్ర, చిరిగిన కోటు, తలపై టోపీతో కనిపించే చాప్లిన్ ను చూస్తేనే నవ్వు వస్తుందనడంలో డౌటే అక్కర్లేదు. నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
కోట్లాది మందికి నవ్వులు పంచిన చాప్లిన్ జీవితం మాత్రం ఆనందంగా సాగలేదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. చాప్లిన్ 1889లో లండన్ లో జన్మించాడు. పదేండ్లు లాంబెత్ వర్క్ హౌస్ లో నివసించాడు. 1910లో అమెరికా వెళ్లాడు. తినడానికి తిండి కూడా లేని కుటుంబంలో జన్మించిన చాప్లిన్ తెలిసిన వాళ్ల ఇళ్ల వద్ద పెరిగారు. బంధువుల వివక్షను చూసి ఆయన బాధపడేవాడు.
మేకింగ్ ఏ లవ్ సినిమాతో తన ప్రస్థానం కొనసాగించారు. చివరకు తన గురించి ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు. ఆయనలో నటుడే కాకుండా మంచి రచయిత కూడా ఉన్నాడు. దర్శకత్వం కూడా వహించారు. ప్రపంచాన్ని తన నవ్వులతో అలరించారు. హాస్య నట చక్రవర్తిగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. మూకీలతో మ్యాజిక్ చేసిన చాప్లిన్ తరువాత మాటలతో మంత్రముగ్ధులను చేశాడు.
చాప్లిన్ కు దైవభక్తి ఉండేది కాదు. నాస్తికుడిగానే పాపులారిటీ సాధించాడు. వ్యంగ్య సినిమా ద గ్రేట్ డిక్టేటర్ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. జీసస్ కంటే తనకే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. 1977లో డిసెంబర్ 25న క్రిస్మస్ పండగ రోజే మరణించారు. చాప్లిన్ కడదాకా నవ్వులతో అందరిని ఆకట్టుకున్నారు. చాప్లిన్ జీవితంలో ఎన్నో మైలు రాళ్లు దాటుకున్నారు.
చార్లీ చాప్లిన్ వేషధారణ కూడా విచిత్రంగానే ఉంటుంది. చాప్లిన్ తన జీవితంలో కష్టాల కడలిని దాటారు. ఒడిదొడుకులను ఎదుర్కొని నిలబడ్డారు. స్వయంశక్తితో ఎదిగి నిరూపించుకున్నారు. ఎవరు ఎన్ని అవాంతరాలు కల్పించినా వాటిని దాటుకుని పోటీలో గెలిచి తన జీవితాన్ని మలుచుకున్నారు.