India vs England : విశాఖ టెస్ట్ లో భారత్ గెలుపు.. బదులు తీర్చుకున్న ఇండియా
India vs England : భారత్, ఇంగ్లండ్ మద్య ఐదు టెస్ట్ సిరీస్ జరుగుతోంది. మొదటి టెస్ట్ హైదరాబాద్ వేదికగా జరిగింది. ఇందులో భారత్ ఓటమి పాలైంది. దీంతో విశాఖపట్నంలో రెండో టస్ట్ జరుగుతోంది. మొదటి టెస్ట్ లో పరాభవానికి భారత్ బదులు తీర్చుకుంది. ప్రత్యర్థిని ఓటమి అంచుల్లోకి నెట్టింది. ఐదు టెస్ట్ ల సిరీస్ లో 1-1 తో సమం చేసింది. కీలక సమయంలో విజయం సాధించి తన సత్తా చాటింది.
రెండో టెస్ట్ లో 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను మట్టి కరిపించింది. బుమ్రా, అశ్విన్ తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ జట్టు 399 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో వేగంగానే పరుగులు తీసింది. దీంతో ఒక దశలో ఇంగ్లండ్ అంత పనిచేస్తుందేమోననే సందేహం అందరిలో కలిగింది. ఆ సమయంలో బెన్ స్టోక్స్ ను ఔట్ చేయడంతో కలిసొచ్చింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ కావ్లీ 73 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. జైస్వాల్ డబుల్ సెంచరీతో మెరిశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో గిల్ సెంచరీతో అదరగొట్టాడు. జైస్వాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. తొలి టెస్ట్ హైదరాబాద్ లో నాలుగు రోజులకే ముగిసింది. రెండో టెస్ట్ మాత్రం రసవత్తరంగా సాగింది.
భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తి కరంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠ కలిగించింది. ఒక దశలో ఇంగ్లండ్ పైచేయి సాధిస్తుందేమోననే బెంగ పట్టుకుంది. రెండో టెస్ట్ ల్లో పరాజయం పాలైతే పెద్ద దెబ్బ పడుతుందని అనుకున్నారు. కానీ మన బౌలర్లు తమ సత్తా చాటి మ్యాచ్ పై ఆశలు పెంచారు. టికెట్లు త్వరగా పడగొట్టి వారి ఓటమిని ఖాయం చేయడం గమనార్హం.