JAISW News Telugu

Team India : కష్టాల్లో భారత్.. చెలరేగుతున్న మార్క్ వుడ్..6 ఓవర్లకే రెండు వికెట్లు..

Team India

Team India

Team India : పోటాపోటీగా సాగుతున్న టెస్టు సిరీస్ లో కీలక సమరానికి సర్వం సిద్ధమైంది. రాజ్ కోట్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు  ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. రెండు వికెట్లను కోల్పోయింది.  3.5 ఓవర్ వద్ద మార్క్ వుడ్ బౌలింగ్ లో స్లిప్ లో ఉన్న జోరూట్ కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ జైశ్వాల్(10) వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే భారత్ మరో వికెట్ ను కూడా కోల్పోయింది. శుభమన్ గిల్ డకౌట్ గా వెనుదిరిగాడు.  5.4 ఓవర్ వద్ద మార్క్ వుడ్ వేసిన బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి చిక్కింది. తాను వరుసగా వేసిన రెండు ఓవర్లలో మార్క్ వుడ్ ఇద్దరిని పెవిలియన్ కు పంపాడు. క్రీజులోకి పటీదార్ వచ్చాడు. భారత్ స్కోర్ 2/2(6 ఓవర్లు)

కీలకమైన మ్యాచ్..
చాలా ఏళ్లుగా సొంతగడ్డపై టీమిండియాకు తిరుగులేదు. ప్రత్యర్థి ఎవరైనా అలవోకగా పైచేయి సాదిస్తూ వస్తోంది. కానీ ఇంగ్లాండ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అనూహ్యంగా తొలి టెస్ట్ ను కోల్పోయిన భారత్.. విశాఖ టెస్ట్ లో గెలిచి సిరీస్ ను సమం చేసింది. పిచ్ లు కూడా విపరీతంగా స్పిన్ కు సహకరించని నేపథ్యంలో రెండు జట్ల పోరు ఆసక్తికరంగా మారింది.

భరత్ స్థానంలో ధ్రువ్ ..
బ్యాట్ తో పాటు వికెట్ కీపర్ కేఎస్ భరత్ వైఫల్యం కారణంగా ఈ మ్యాచ్ లో అతడి స్థానంలో ఉత్తర ప్రదేశ్ కీపర్ ధ్రువ్ జురెల్ ను తీసుకున్నారు. జురెల్ దేశవాళీ క్రికెట్ లో 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 46.47 సగటుతో పరుగులు సాధించాడు. రాజ్ కోట్ లో పిచ్ స్పిన్ కు విపరీతంగా సహకరించే అవకాశం లేనందున ఇక్కడ అరంగ్రేటం జురెల్ కు ఎంతో ఉపయోగపడనుంది.

భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), అశ్విన్, కుల్ దీప్, బుమ్రా, సిరాజ్.

ఇంగ్లాండ్ జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జోరూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్ లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.

Exit mobile version