Team India Youth : టీ 20 ప్రపంచ కప్ తర్వాత టీం ఇండియా జింబాబ్వే లో అయిదు మ్యాచుల టీ 20 సిరీస్ ఆడనుంది. దీని కోసం బీసీసీఐ సెలెక్టర్లు శుభమన్ గిల్ సారథ్యంలో కొత్త టీంను సెలెక్ట్ చేశారు. ఇందులో చాలా మంది కొత్త ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ పర్యటనలో శుభమన్ గిల్ కు కెప్టెన్సీ అప్పగించారు. జింబాబ్వే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జులై 7 నుంచి జులై 14 వరకు కొనసాగనుంది. మ్యాచులు సాయంత్రం 4.30 నిమిషాలకు ప్రారంభం అవుతాయి.
ఇటీవల ఐపీఎల్ లో రాణించిన యువ ఆటగాళ్లకు టీం ఇండియా జట్టులో చోటు కల్పించారు. రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ తుషార్ దేశ్ పాండే లను సెలెక్ట్ చేశారు. ఈ టోర్నీలో మంచి పర్ఫామెన్స్ కనబరిస్తే మెయిన్ జట్టులో కూడా యువకులకు చోటు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టోర్నీని ఎక్కువ మంది ఉపయోగించుకోవాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్ ఆడుతున్న జట్టులోంచి ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయకపోవడం విశేషం. ముఖ్యంగా రోహిత్, విరాట్, సూర్య తో పాటు ఇతర బ్యాటర్లను కూడా పరిగణలోకి తీసుకోలేరు. బౌలర్లలో బెంచ్ పై ఉన్న ఒక్క ఖలీల్ అహ్మద్, బ్యాటర్లలో అమెరికా వెళ్లిన 16 వ ప్లేయర్ రింకూ సింగ్ ను మాత్రమే సెలెక్ట్ చేశారు.
టీ 20 జట్టులో చోటు దక్కించుకున్న వారు శుభమన్ గిల్, (కెప్టెన్) రుతు రాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్) ద్రువ్ జురెల్ (వికెట్ కీపర్) రింకూ సింగ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీశ్ రెడ్డి, అవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, ముఖేశ్ కుమార్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్ పాండే