Teacher arrested : విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి అరెస్టు

Teacher arrested
Teacher arrested : విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన గురువు నీచంగా ప్రవర్తించాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్కల టీచర్ విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. విద్యాసాగర్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసులకు, తహశీల్దార్ కు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఉపాధ్యాయుడు గతంలో పనిచేసిన పాఠశాలల్లో ఇవే ఆరోపణలతో రెండు సార్లు సస్పెండ్ చేసినా అతని తీరు మారలేదని పాఠశాల సిబ్బంది పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.