Team India : టీ ఇండియా వెరీ స్ట్రాంగ్.. ఈ సారి కప్పు మనదేనా?
Team India : జూన్ 2 నుంచి ఆరంభం కానున్న టీ 20 వరల్డ్ కప్ కు టీం ఇండియా ను సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్ గా హర్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఇందులో యశస్వి జైశ్వాల్, సూర్య కుమార్ యాదవ్, విరాట్ కొహ్లి ప్రధాన బ్యాటర్లుగా ఎంపికయ్యారు. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, రిషబ్ పంత్ ఎంపిక కాగా.. బ్యాటింగ్ లైనప్ దుర్బేద్యంగా ఉంది.
బౌలింగ్ లో అద్భత ఫామ్ లో ఉన్న బుమ్రా కు తోడు సిరాజ్ పేస్ బౌలింగ్ దాడి ప్రారంభించనున్నారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ విభాగంలో తుది జట్టులో చోటు ఖాయం. హర్దిక్ పాండ్యాతో పాటు శివమ్ దూబె కూడా పేస్ ఆల్ రౌండర్లుగా ఫైనల్ టీం లో ఉండనున్నారు. దీంతో ఇండియా స్ట్రాంగ్ టీంగా కనిపిస్తోంది.
మరో నలుగురు ప్లేయర్లను స్టాండ్ బైలుగా ఎంపిక చేసింది. అయితే రింకు సింగ్ ను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వచ్చినా శివమ్ దూబె మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. దీంతో బెస్ట్ టీంను సెలెక్ట్ చేసినట్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తెలిపింది.
అమెరికా, వెస్టిండీస్ లు ఆతిథ్యం ఇస్తున్న ఈ పిచ్ లు కాస్త స్లో వికెట్ గా ఉంటాయి. బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ ఇండియా బ్యాటింగ్ విభాగం వరల్డ్ బెస్ట్ స్ట్రాంగ్ లైనప్ తో కనిపిస్తుంది. దీంతో ఈ సారి వరల్డ్ కప్ మనదే అనే భావన కలుగుతోంది. జూన్ 9న పాకిస్థాన్ తో అమెరికాలో హై హోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గత టీ 20 వరల్డ్ కప్ లో విరాట్ కొహ్లి తన బెస్ట్ పర్ఫామెన్స్ తో ఇండియాను చివర్లో గట్టెక్కించడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సారి టీ 20 వరల్డ్ కప్ కొట్టి టీం ఇండియా అభిమానుల కల నెరవేర్చాలని కోరుకుంటున్నారు. తుది జట్టు అంచనాకొస్తే రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, కొహ్లి, సూర్య, హర్దిక్, దూబె, సంజు శాంసన్, జడేజా, కుల్దీప్, సిరాజ్, బుమ్రా లతో భీకరంగా కనిపిస్తోంది. అక్షర్ పటేల్, చాహల్, పంత్, అర్షదీప్ సింగ్ తో బెంచ్ కూడా బలంగా ఉంది.