JAISW News Telugu

TDP : టీడీపీ ప్లాన్ అదిరిపోయింది.. రాజ్యసభ అభ్యర్థిని పెడితే గెలవాల్సిందే!

TDP's extrodinary plan

TDP’s extrodinary plan to win

TDP  : ఏపీలో జనాలు, రాజకీయ నాయకుల దృష్టంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి కంకణం కట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవకుంటే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ఉన్నాయి. అయితే పైకి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వ్యూహాలుగా కనపడుతున్నా.. సందులో సందుగా రాజ్యసభ ఎన్నికల వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నాయి.

రాజ్యసభ ఎన్నికల విషయంలో టీడీపీ పక్కా ప్లాన్ తోనే ఉంది. అభ్యర్థిని పెడితే గెలిచి తీరాలన్న లక్ష్యంతో ఉంది. ఆ దిశగానే కసరత్తు చేస్తోంది. రాజ్యసభ ఎన్నికలపై ఓ టీమ్ ఇప్పటికే సమన్వయం చేసుకుంటోంది. పార్టీ బలం ఎంత.. ఎంతమంది ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది.. వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా తాము ఓటేస్తామని ముందుకొచ్చారు. మరికొంత మంది టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు జనసేన చీఫ్ తో టచ్ లోకి వచ్చారు. అన్నీ అంశాలను గమిస్తున్నారు.

ఎవరు పోటీ చేస్తారన్న దానిపై చివరి వరకూ గుట్టుగానే ఉంచాలనుకుంటున్నారు. టీడీపీ తరుపున పోటీ చేస్తే దళిత నేతను నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ పూర్తిగా దళిత నేతలని పావులుగా చేసి రాజకీయం చేస్తోంది. వారి సీట్లకే టెండర్ పెడుతున్నారు. జగన్ రెడ్డి కసరత్తులో భాగంగా ఇప్పటివరకూ టికెట్లు ఎగ్గొట్టిన వారిలో 28 మంది రిజర్వుడు నియోజకవర్గాలకు చెందిన వారే ఉన్నారు. వారంతా దళిత అభ్యర్థిని పెడితే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

వైసీపీకి ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఉంది. జగన్ రెడ్డి మార్పులు, చేర్పులు చేసిన సీట్లు మినహా.. మిగతా అన్ని చోట్లా అందరికీ ఖాయం అని చెప్పడం లేదు. ఆముదాల వలస వంటి చోట్ల వేరే అభ్యర్థిని ఖరారు చేసినా.. కొన్ని కారణాల వల్ల ప్రకటించడం లేదు. ఇలా చాలా చోట్ల నియోజకవర్గాల్లో మార్పుచేర్పులకు రెడీ అయినా.. రాజ్యసభ ఎన్నికల కారణంగా ఆపేశారు. వీరంతా ధిక్కరించే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలుగా భావిస్తున్నారు. ఆవేశంలో అయినా వీరంతా పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే టీడీపీ వ్యూహాలేమిటో.. ఆ పార్టీతో ఎవరెవరు టచ్ లోకి వెళ్లారన్న దాన్ని తెలుసుకునేందుకే వైసీపీ నేతలు అత్యధిక సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version