Sharmila : షర్మిలను అడ్డుకోవాలని టీడీపీ నిర్ణయం

TDP's decision to block Sharmila

TDP’s decision to block Sharmila

Sharmila : తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేపట్టిన షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి బదులుగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలి పదవి కోరింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ పీసీసీ పదవిని అప్పగించింది. జనవరిలో బాధ్యతలు స్వీకరించిన షర్మిల ప్రచారం కూడా మొదలు పెట్టింది.

అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ గా షర్మిలను ప్రమోట్ చేసేందుకు టీడీపీ అనుబంధ మీడియా చర్యలు చేపట్టింది. షర్మిలను విస్తృతంగా కవర్ చేయడం ద్వారా జగన్ మోహన్ రెడ్డికి చెక్ మేట్ గా ఉపయోగపడుతుందని సంబంధిత మీడియా భావించింది. అయితే షర్మిలకు పబ్లిసిటీ ఇవ్వడం వల్ల టీడీపీకి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని గ్రహించారు.

వైసీపీ ఓట్లను చీల్చే సత్తా షర్మిలకు లేదని, షర్మిలతో టీడీపీ కుమ్మకైందని తటస్థ ఓటర్లలో నెగెటివ్ అభిప్రాయం కలిగించడం ద్వారా టీడీపీకి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని టీడీపీ వర్గం ఆందోళన చెందుతోంది. మొత్తమ్మీద షర్మిలను ప్రోత్సహించకూడదనేది ఇప్పుడు టీడీపీ హైకమాండ్ నిర్ణయం. ఇదే సందేశాన్ని టీడీపీ అనుబంధ మీడియా సంస్థలకు చేరవేశారు.

షర్మిలపై కూడా రాజకీయ అస్త్రాలు సంధించాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చితే తామే ఇబ్బంది పడతామని భావించిన టీడీపీ ఈ మేరకు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గంపగుత్త ప్రభుత్వ వ్యతిరేఖ ఓట్లు టీడీపీ+జనసేన ఖాతాకు మరల్చాలి. లేదంటే చాలా సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

TAGS