Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీల డైలాగ్ వార్ రోజు రోజుకు పెరుగుతోంది. అయితే, ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు (ఫిబ్రవరి 5) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ+జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఇదే సమయంలో 2 పార్టీల సీట్లలో జనసేనకు 25 కేటాయిస్తారనే నిర్ణయంపై మంత్రి అంబటి స్పందించారు. చంద్రబాబు ఇచ్చే సీట్లు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
పొత్తుల్లో సీట్లు
టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ 30 సీట్లు కోరగా, 27 సీట్ల వరకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేకు ఇచ్చే 20 సీట్లను బాబు ఇప్పటికే ఖరారు చేసినట్లు పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి. జనసేనకు 25 నుంచి 30 సీట్లు కేటాయించడంపై మంత్రి అంబటి విమర్శలు గుప్పిస్తున్నారు.
‘చంద్రబాబు జనసేన పార్టీకి 20 నుంచి 25 సీట్లు కేటాయించడమే గగనం అన్నారు. ఇప్పటికైనా ‘జనసైని’కులు వారిని అర్థం చేసుకోవాలని సూచించారు. జగన్ ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైయస్ఆర్సీపీ అన్నారు.
మార్పులు చేర్పులు..
175 సీట్లు గెలవడమే లక్ష్యంగా పార్టీలో అవసరమైన మార్పులు చేస్తున్నామని చెప్పారు. జనసేన నాయకులను, కార్యకర్తలను పవన్ కళ్యాణ్ ముంచుతారని వ్యాఖ్యానించారు. జనసేనాని ఆలోచించుకోవాలి. ఇందులో యువరాజు లోకేశ్ కనిపించకపోవడం దారుణం’ అని అంబటి అన్నారు.
‘లోకేష్ ను దాచినా.. సీట్ల పంపకం గురించి ఆయనకు చెప్పకపోయినా టీడీపీ ఔటే.. ఇది వాస్తవమని అంబటి అభివర్ణించారు. పాదయాత్ర చేసిన వీరుడు, శూరుడు అని చెప్పిన లోకేష్ ను పక్కన పెట్టారని, అన్యాయాలు, అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరి’ అని అంబటి వ్యాఖ్యానించారు.