Pithapuram : పిఠాపురంలో నాగబాబుకు చుక్కలు చూపించిన టీడీపీ కార్యకర్తలు

Pithapuram Politics : పిఠాపురంలో జనసేన నాయకుడు నాగబాబుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యకర్తల నుండి తీవ్ర నిరసన ఎదురైంది. కుమారపురంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమానికి హాజరైన నాగబాబును టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టి “జై వర్మ” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వివరాల్లోకి వెళితే, నాగబాబు కుమారపురంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు. వారు పెద్ద ఎత్తున “జై వర్మ” అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నిరసనతో జనసేన కార్యకర్తలు కూడా రంగంలోకి దిగడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.

కాగా, ఈ నిరసనల నేపథ్యంలో టీడీపీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ వర్మ నాగబాబు పర్యటనకు దూరంగా ఉండటం గమనార్హం. వర్మ దూరంగా ఉండటంతోనే టీడీపీ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయి నిరసన తెలిపినట్లు తెలుస్తోంది.

TAGS