TDP win : ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. బరిలో నిలిచిన రాజకీయ నాయకుల భవితవ్యం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తం అయి ఉంది. ఇక జూన్ 4న వెలువడనున్న ఫలితాల కోసం రాష్ట్రప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. గెలుపుపై పార్టీల నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ స్థానాల్లో గెలిచి తీరుతామని కూటమి నేతలు చెబుతున్నారు. కూటమి పార్టీలు గా ఉన్న టీడీపీ, జనసేన , బీజేపీలు 115 నుంచి 140 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో తిరిగి అధికారం చేజిక్కించుకుంటామని వైసీపీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు.
కౌంటింగ్ వేళ ఎన్నికల సీఈఓ హెచ్చరిక..!
ఇదిలా ఉంటే రాజకీయ పార్టీల చూపంతా నేడు విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్‌పైనే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి పట్టం కడతాయోనని ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తుది దశ పోలింగ్ ముగియగానే అంటే శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఇకపోతే పందెం రాయుళ్లకు ఈ ఎన్నికలు పండగలా మారాయి. ఐపీఎల్ ముగియడంతో ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో అని భారీ ఎత్తున పందెలు కాస్తున్నారు. ఒక్క ఏపీలోనే 2000 వేల కోట్ల రూపాయల వరకు పందేలు జరిగినట్లు సమాచారం.
తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో బెట్టింగ్ వ్యవహారం ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కదిరిలో టీడీపీ గెలుస్తుందని పందెం వేశారు. మరొకరేమో ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఏకంగా రూ.10 లక్షలు పందెం వేయడం విశేషం. అయితే వైసీపీకి చెందిన నేత ఒకరు కదిరిలో తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని పందెం వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ వైసీపీ నేత పేరు మాత్రం బయటకు రావడం లేదు. దీంతో ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.