Bhashyam Deepthi : అత్యధిక మేజార్టీతో టీడీపీని గెలిపించాలి : భాష్యం దీప్తి

Bhashyam Deepthi
Bhashyam Deepthi : అమరావతి మండలం మల్లాది గ్రామంలో శుక్రవారం భాష్యం ప్రవీణ్ సోదరుడు భాష్యం నవీన్ సతీమణి భాష్యం దీప్తి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భాష్యం ప్రవీణ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా భాష్యం దీప్తి మాట్లాడుతూ సంక్షేమానికి, అభివృద్ధికి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు అని, గ్రామాలు సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.