Bhashyam Praveen : భారీ మెజారిటీతో తనను గెలిపించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కోరారు. గురువారం అచ్చంపేట మండలం కొండూరు, నిండుజెర్ల గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలను దర్శించుకొని పూజలు చేశారు.
అనంతరం భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఓటు ఒక్క అవకాశం అంటూ మోసపూరిత అబద్ధపు హామీలతో గద్దెనెక్కాడని అన్నారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సంక్షేమం పేరుతో పేద బడుగు బలహీన వర్గాలకు నామమాత్రంగా డబ్బు ఆశ చూపించి వాళ్ళని మోసం చేశాడని అన్నారు. నిత్యవసర సరుకులు, కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు ప్రతి వస్తువుపై జే టాక్స్ విధించి మామూళ్లు వసూలు చేస్తున్నాడని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.