TDP : వైయస్సార్సీపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి “రా కదలి రా!” పేరిట తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నిక ల్లో కలిసి పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చిన తెలు గుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచ రణతో ముందుకు సాగుతున్నాయి. రోజుకు రెండు చొప్పు న జరిగే కార్యక్రమాలకు చంద్రబాబు లేదా పాటు పవన్ కళ్యాణ్ హాజరై అవకాశం ఉంది మరికొన్ని సభలకు ఇద్దరు హాజరై ప్రసంగించనున్నారు.
అందులో భాగంగా ఇక, తెలుగుదేశం-జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరిం చారు.. సైకిల్ – గాజు గ్లాసు తో కూడిన లోగోను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించిన విషయం విదితమే.. ఈ రోజు పంచాయి తీల సమస్యలపైసర్పంచ్‌లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తారు..
బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయ హో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది.. 5వ తేదీ నుంచి 29 వరకూ 22 పార్ల మెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు ఉంటా యని పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 5న ఒంగో లు, 6న విజయవాడ, నర సాపురం పార్ల మెంట్ పరిధిలో సభలు నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 18న ఎన్టీర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభ నిర్వహించనున్నారు. మొత్తం మీద జగన్ పాలనను అంత మొందిం చేందుకు జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి కార్యచరణతో ప్రజల్లోకి వెళ్తుండడంతో వైసిపి నేతల్లో గుబులు మొదలైంది. ఇప్పటివరకు మాకు అనుకూలంగా ఉంది అనుకున్న వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి.