Bhashyam Praveen : వైసీపీ మూయించిన షాపులను తెరిపించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్

Bhashyam Praveen
Bhashyam Praveen : సోమవారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కి ఓటు వేశారనే నెపంతో అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో వైసిపీ గుండాలు ఆర్యవైశ్య ఇళ్లపై దాడిచేశారు. దౌర్జన్యంతో వారిని భయభ్రాంతులకు గురిచేసి వారి షాపులు మూయించి వేశారు. దీంతో మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ బాధిత ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి, ధైర్యం చెప్పి దగ్గరుండి తిరిగి వారి షాపులను తెరిపించారు.
ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతామనే నైరాశ్యంలో వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడడం దారుణమన్నారు. వ్యాపారాలు చేసుకునే వారి షాపులను దౌర్జన్యంగా మూసివేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలుసులను కోరారు. ఎవరికీ భయపడకుండా షాపులను ఎప్పటిలా నిడిపించుకోవాలని బాధితులకు సూచించారు. ఎల్లవేళలా తాను వారికి అండగా ఉంటానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.