TDP MLA Bandaru Sravani : టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే

TDP MLA Bandaru Sravani : టీడీపి కార్యకర్తను ఆరెస్ట్ చెప్పించిన టీడీపి ఎమ్మెల్యే బండారు శ్రావణీ తీరు చర్చనీయాంశమైంది.. టీడీపీ పార్టీ కోసం గత ఎన్నికల వేళ ఎంతో పాటుపడ్డ కార్యకర్తను సొంత పార్టీ ఎమ్మెల్యే ఎలా అరెస్ట్ చేయిస్తారని పార్టీ నతేలంతా గుస్సా అవుతున్న పరిస్థితి నెలకొంది. సొంత చెల్లెలి వరస ఉన్న అమ్మాయితో రేప్ కేసు పెట్టించిన శింగనమల టీడీపి ఎమ్మెల్యే బండారు శ్రావణీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లైవ్ లో పోలీసులు వచ్చీ టీడీపి కార్యకర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ఇక టీడీపీ కోసం పాటుపడిన నేతకే ఇంతటి జైలు గతి పట్టడంపై కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. పోలీసులను ఎదురించారు. వారితో గొడవపడి సృహ తప్పి పడిపోయిన కుటుంబ సభ్యులు తీరు కలిచివేసింది.

పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో పురుగులు మందు డబ్బాతో కుటుంబ సభ్యులు ఆత్మహత్యకి ప్రయత్నం చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆపే ప్రయత్నం చేసినా వీలుకాలేదు.

గార్లదీన్నే పోలీస్ స్టేషన్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చపట్టారు. మెడలో టీడీపి సభ్యత్వం వేసుకొని … మీడియా కు వాయిస్ ఇస్తుండగానే జీప్ లో తీసుకెళ్ళిన పోలీసులు తీరును ఖండించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణీ నమ్ముకుంటే బరువు, బాధలే మిగిలాయని కార్యకర్తలంతా గోడు వెళ్లబోసుకున్నారు.

TAGS